Breaking News

ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహానికి కేసీఆర్ ప్లాన్

29354C9E00000578-3103951-image-a-20_1433016078728

తెలంగాణ సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డా. బీఆర్ అంబేద్కర్ 125 జయంతి ఏప్రిల్ 14న రానుంది. దీనిపై హైదరాబాద్ లో సమీక్ష జరిపిన కేసీఆర్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన ఓ కమిటీ వేశారు. అంతేకాదు.. ఈ నెల 14న అంబేద్కర్ జయంతిరోజు ప్రపంచంలోనే ఎత్తైనా 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు  చేసేందుకు నిర్ణయించారు. ఈ నెల 14 అంబేదర్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లో మంచి స్థలాన్ని ఎంపిక చేసే బాధ్యతను కడియం శ్రీహరి కమిటీకి అప్పగించారు. ఏడాదిలోగా స్థల అన్వేషణ, ఎత్తైన విగ్రహ నిర్మాణాన్ని కమిటీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

దళితుల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ప్రకటించిన కేసీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కమిటీలో దళిత ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. కమిటీలో రసమయి బాలకిషన్, ఎంపీ బాల్క సుమన్, మల్లేపల్లి లక్ష్మయ్య, గువ్వల బాలరాజు, కొప్పుల ఈశ్వర్, పసునూరి దయాకర్,  మేయర్ బొంతు రామ్మోహన్,  మంత్రులు మహమూద్ అలీ, నాయిని,  చందూలాల్, జగదీష్ రెడ్డిలను అధికారులను నియమించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *