ప్రధాని చత్తీస్ ఘడ్ పర్యటన : 4 గ్రామాలను దిగ్బంధించిన మావోయిస్టులు

modi_maoist

చత్తీస్ ఘడ్ : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం చత్తీస్ ఘడ్ లోని పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను నిరసిస్తూ సుకుమా జిల్లాలోని నాలుగు గ్రామాల ప్రజలను మావోయిస్టులు దిగ్బంధించారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు గ్రామస్థులను వదిలేది లేదని స్పష్టం చేశారు. దాదాపు 400 మంది మావోయిస్టులు ఆయుధాలతో నాలుగు గ్రామాలను హస్తగతం చేసుకున్నారు.

కాగా ప్రధాని పర్యటనకు ఆటంకం కలిగించేందుకే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని సుకుమా ఎస్పీ తీవ్రంగా ఖండించారు. కాగా ఓ వైపు నక్సల్ ఏరియాలో ప్రధాని పర్యటన, మావోయిస్టుల ఘటన నేపథ్యంలో దాదాపు 15వేల మంది పోలీసులు, జవాన్లలను చత్తీస్ ఘడ్ లో మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉత్కంఠగా ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *