ప్రధాని నరేంద్ర మోదీ పై కేసు

PTI9_25_2014_000070A_Kand_0_0_0_0

లక్నో : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కేసు నమోదైంది. విదేశీ పర్యటనలో భాగంగా యూరప్ వెళ్లిన ప్రధాని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. భారత్ లో పుట్టినందుకు సిగ్గు పడుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సమాచార హక్కు కార్యకర్త సందీప్ శుక్లా కోర్టులో ఫిర్యాదు చేశారు. మోదీ ప్రసంగాన్ని తాను టీవీలో ప్రత్యక్షప్రసారం చూశానని.. ఆయన మాటలు దేశప్రజలను  నొప్పించాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నరేంద్ర మోడీ ప్రసంగించిన వీడియో క్లిప్పింగ్స్ సీడీని శుక్లా సాక్ష్యంగా సమర్పించాడు. దీంతో ప్రధానిపై కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *