
ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వదని చంద్రబాబుకు సైతం తెలుసని.. అయినా ఏదో సాధిస్తాం అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వమంటూ పార్లమెంటులో ప్రకటన చేసిన నేపథ్యం జేసీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
జనం నమ్మి ఓట్లేసి గెలిపిస్తే బీజేపీ హ్యాండ్ ఇస్తుందని ఊహించలేదన్నారు. వెంకయ్య ప్రతిపక్షంలో ఎన్నో చెప్పారని.. అధికారంలోకి వచ్చాక కాలదన్నుతున్నాడని వాపోయారు. చంద్రబాబుకు సైతం ప్రత్యేక హోదా రాదని తెలుసని కానీ ఇంకా జనాలకు నిజం చెప్పడం లేదని వాపోయారు జేసీ