ప్రత్యేక హోదాపై స్సష్టత వచ్చేనా…?

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి చురుకుగా ముందుకు కదులుతుంటే జగన్ వర్గం మాత్రం ప్రత్యేక హోదాపై స్సష్టత కోసం ఆందోళనలు చేస్తున్నారు. జగన్ చేస్తున్న ఈ ధర్నా మంచికే అయినా.. ఆంధ్రప్రదేశ్ మొత్తం అమరావతి శంకుస్థాపన పనుల్లో నిమ్మగ్నమవడంతో ఈ ధర్నా అటు ప్రజలను,  ఇటు ప్రభుత్వాన్ని అంతగా ప్రభావితం చేయనప్పటికీ, జగన్ ను చంద్రబాబు రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించడం, జగన్ రాననడంతో ఈ అంశం ఉత్కంఠ నెలకొంది. అయితే రాజధాని నిర్మాణానికి ఈనెల 22న మోడీ రానున్నందున మరి ఆ కార్యక్రమంలో మోదీ ప్రత్యేక హోదాపై వరాల జల్లు కురిపిస్తారేమోనని ప్రజలు, ప్రభుత్వం కోటి ఆశలతో వేచి చూస్తున్నారు. అయితే రాజధాని నిర్మాణానికి వస్తున్న మోడీ తమను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని జగన్ మోడీకి లేఖ రాశారు. ఒక వేళ మోడీ జగన్ కలిసేందుకు అంగీకరిస్తే జగన్ ఎటువంటి అంశాలను మోడీ ముందుంచుతారు, వాటిలో వేటికి మోడీ సానుకూలంగా స్పందిస్తారో వేచి చూడాలి. మొత్తానికి ఏపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహామహులు రానుండడంతో ప్రత్యేక హోదా విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు పలువురు విశ్లేషకులు. ప్రత్యేక హోదాపై స్పష్టత వస్తే ప్రతిపక్షాలు బలపడి అధికార పక్షానికి మరింత బలం చేకూరుతుంది.  ఒక వేళ ప్రత్యేక హోదాపై ఎటువంటి ప్రకటన ఇవ్వకపోతే ఇప్పటికే ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్న విపక్షాలు మరింత బలపడి ఉద్యమ పార్టీగా చరిత్రకెక్కుతాయి. అధికార పార్టీ మాత్రం ప్రజల వ్యతిరేకతను మూటకట్టుకోక తప్పదు. ఏదీ ఏమైనా ఈ అంశం ఓ కొలిక్కి రావాలంటే అమరావతి శంకుస్థాపన కార్యక్రమ సమయం వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే!!

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *