
బీజేపీ, టీడీపీతో కలిసి జనసేన ప్రచారం చేసి ఏపీని ఉద్దారిస్తామంటూ ముందుకొచ్చాయి. బీజేపీ ఎలాగూ అధికారంలోకి వస్తుంది కదా అని జనం టీడీపీని గద్దెనెక్కించారు. జనసేన పవనాలు కూడా ప్రశ్నించడం మాని టీడీపీకి సపోర్ట్ చేశాడు… ఇక టీడీపీ పాలన సంవత్సరం గడిచింది..
ఇక్కడే కాంగ్రెస్ టీడీపీకి అసలు ట్విస్ట్ ఇచ్చింది..ప్రత్యేక హోదాపై తిరుపతిలో పోరుబాట సభ నిర్వహించింది.. అక్కడ ఓ యువకుడు అగ్నికి ఆహుతికావడం వివాదానికి కారణమైంది.. ఇది ఇప్పుడు రావణకాష్టంలా ఏపీని రగిలిస్తోంది..
ఇక సందులో సడేమియాలా జనసేన పవన్ కళ్యాణ్ ప్రత్యేకహోదాపై సైలెంట్ అయ్యారు. ప్రశ్నిస్తానన్న గొంతు మూగబోయింది.. ప్రాణాలు పోతున్నా ప్రశ్నించలేని పవన్ వైఖరి ఢిల్లీ జగన్, ఎమ్మెల్యే రోజా తూలనాడారు. ఇప్పటికైన ప్రశ్నించవయ్యా పవనాలు..