ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం  దళిత,గిరిజన పుత్రుల విజయం: కడియం

 

#అందుకు తోడ్పడింది ముఖ్యమంత్రి కేసీఆర్

#పటిష్ట అమలుకోసం నిబంధనల రూపకల్పన

#చట్టం అమలు పై రాష్ట్ర స్థాయీ,జిల్లా స్థాయీలో కమిటీలు

#బడ్జెట్ ప్రతిపాదనలపై టైమ్ టేబుల్

#జనాభా ప్రాతిపదికన కేటాయింపులు

—-యస్.సి ,యస్.టి అభివృద్ధి నిధులు చట్టం పై ఉపముఖ్యమంత్రి కడియం

 

యస్.సి ,యస్.టి కులాలప్రత్యేక  అభివృద్ధి నిది చట్టం సాధించుకోవడం తెలంగాణ రాష్ట్రంలో దళిత,గిరిజనుల విజయంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభివర్ణించారు. అందుకు మూలం మాత్రం రాష్ట్ర  ముఖ్యమంత్రి కలువకుంట్ల చంద్రశేఖర్ రావే నాని ఆయన కొనియాడారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హరిజన ,గిరిజన వర్గలా అభ్యున్నతికి గాను యస్.సి ,యస్.టి ప్రత్యేక  అభివృద్ధి నిధి పేరిట ఇటీవల రూపొందించిన ఛట్ఠం విధి విధానాలను ,అమలుకు అవసరమైన నిబంధనలు రుపొందించడానికి గాను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సచివాలయ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి కులాల అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ,తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్ ఘంటా చక్రపాణి ,బుద్దవనం అభివృద్ధి కమిటీ ఛైర్మెన్ మల్లేపల్లి లక్షమయ్య లతో పాటు యస్.సి కులాల అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా,డైరక్టర్ కరుణాకర్ ,గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ ,కమిషనర్ లక్ష్మణ్ ,అదనపు సంచాలకులు సర్వేస్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా జాతుల అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిన ఈ చట్టం పటిష్ఠంగా అమలుకోసం నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు .

చట్టంలో రూపొందించిన అంశాలను ఆయన ఉటంకిస్తూనే యస్.సి ,యస్ .టి ల అభివృద్ధికి దోహద పడే వ్యత్యసాలను తొలగించేందుకు ఒకటికి రెండు సార్లు అధ్యయనం చేయాలనీ ఆయన సూచించారు .

జనాభా ప్రాతిపదికన నిధులు కేటయింపులు ఉండేలా చూడడంతో పాటు విద్యాపరంగా ,వైద్యపరంగా ,సామజికపరంగా ఉండే వ్యత్యసాలను పుడచడానికి గాను నిధులు ఉండేలా చూడాలని ఆయన చెప్పారు .

బడ్జెట్ ప్రతిపాదనలు ప్రాధాన్యత క్రమంలో కాలపట్టిక ఉండేలా చూడగలిగితే ఛట్ఠంకు సార్ధకత చేకూరుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు.

అవిభాజ్యత అంశాలను ప్రస్తావిస్తూ యస్.సి,యస్.టి లకు నిర్దిష్టాంగా  నిధులు  కేటయింపులు ఉండేలా చూడాలన్నారు . అంతే గాకుండ ఈ చట్టం అమలుపైన రాష్ట్ర స్థాయీలో ఓ మానిటరింగ్ కమిటీ ఏర్పటు చేయడంతో పాటుగా జిల్లా స్థాయీలో కూడా ఓ యస్.సి ,యస్.టి ప్రజాప్రతినిధి ఛైర్మెన్ ఉండేలా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ ఉండేలా నిబంధనలు రుపొందించాలన్నారు .

నిపుణులతో చర్చించి ఈ చట్టం ప్రతిష్టాంగా అమలు జరిపేందుకు వీలుగా తిరిగి ఈ నెల 20 న మల్లి సమావేశం కావాలని నేడు జరిగిన సమీక్షా సమావేశం నిర్ణయించింది .

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *