Breaking News

ప్రత్యూష కష్టం చూసి కదిలివస్తున్న సీఎం

kcr prathusha

కన్న తండ్రి, సవతి తల్లి పెట్టిన చిత్ర హింసల వల్ల తీవ్రంగా గాయపడిన ప్రత్యూష బాధ్యతలను పూర్తిగా స్వీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రత్యూషకు చెందిన కథనాలు మీడియాలో వచ్చిన తర్వాత కేసిఆర్ పూర్తిగా చలించిపోయారు. అధికారుల ద్వారా పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. తల్లిని కోల్పోయిన ప్రత్యూషను బంధువులు కూడా ఎవరూ చేరదీయక పోవడం పట్ల కేసిఆర్ ఆవేదన చెందారు. కన్న తండ్రి, సవతి తల్లి పెట్టిన చిత్ర హింసలు భరిస్తూ ఆమె పడిన వేదన ఎంత నరకపాయమో అని సిఎం శుక్రవారం రాత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యూషకు సంబంధించిన అన్ని విషయాలను ఇకపై ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. ప్రస్తుతం సరూర్ నగర్ లోని గ్లోబల్ ఆవేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను శనివారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి సతీ సమేతంగా కలువనున్నారు. పదవ తరగతి పూర్తి చేసిన ప్రత్యూషతో మాట్లాడిన తర్వాత, ఆమె ఏమి చదవాలనుకుంటుంది? ఎక్కడ వుంచాలి? ఆమెకు మంచి భవిష్యత్ అందివ్వడం కోసం తానేం చేయగలను? అనే అంశాలను నిర్ణయించాలని సిఎం భావిస్తున్నారు. పవిత్ర రంజాన్ దినం నాడు ప్రత్యూషను కలిసి, ఆమెకు కొత్త జీవితం అందివ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. గత రెండు రోజులుగా ప్రత్యూషనే తనకు తరచూ గుర్తుకు వస్తున్నదని, ఆమె ఆలనా పాలనా చూడడంతో పాటు, చదువుకు అయ్యే ఖర్చును కూడా భరించాలని కేసిఆర్ నిర్ణయించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *