
మహిళలు, విద్యార్ధినులపై జరుగుతున్న అఘాయిత్యాల నియంత్రణకు ప్రజలు భాగస్వామ్యులు కావాలని, ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీసేనని ట్త్రెనీ ఐపిఎస్ అధికారి సింధూశర్మఅన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణ-పోలీస్ ల పాత్ర అనే అంశంపై శుక్రువారం జరిగిన సెమినార్ లో సింధూశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకుంటూ పోలీసుశాఖ మహిళలు, విద్యార్ధినులపై జరుగుతున్న నేరాల నియంత్రణకు ముందుకు సాగుతోందని, మరింత పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగేందుకు అవగాహన కార్యక్రమాలు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన తర్వాత కొన్ని తరహ నేరాల్లో రాజీకి రావడం వల్ల కొందరు నిందితులు శిక్షింపబడలేక పోతున్నారని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాద్యులపై ఉందన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో జరుగుతున్న నేరాలను సంబంధిత భాద్యులకు అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ లకు సమాచారం అందించాలని సూచించారు. గతంలో పోల్చిచూసినట్లయితే జిల్లాలోని మహిళల్లో చైతన్యం ఉబుకుతోందని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఎడ్ల. సుగుణాకర్, ఎం.పి.ఇ మాతంగి, లింగయ్య, సర్పంచ్ వర్షిణి-శేకర్ గౌడ్, ఎ.మ్మార్వో వెంకటరెడ్డి, మహిళపోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరెడ్డి, మానకొండూరు ఎస్.ఐ వెంకటేశ్వర్టు తదితరులు పాల్గొన్నారు.