Breaking News

ప్రతి పోలీసుకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

02

మారుతున్న కాలానికనుగుణంగా ప్రతి పోలీసు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ అన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరిగా మారిందని పేర్కొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం అమలులో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని దివంగత జాన్ విల్సన్ స్మారక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఆవరణలో ఎంటర్ ప్రైజెస్ ఈ-కాప్స్ విదానం అమలుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో కేసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుోందన్నారు. కేసుల నమోదు సందర్భంగా పూర్తి వివరాలను పొందుపరుచాలని సూచించారు. రాబోయే కాలంలో ఈకోట్స్, ఈ జైల్స్ , జె.ఆర్.యం.ఎస్.పి.యం.ఎస్ విధానాలు అమల్లోకి రానున్నాయని చెప్పారు.

01

కార్యక్రమంలో ఓఎస్ డీ సుబ్బారాయుడు, లీగల్ సెల్ ఇన్ స్పెక్టర్ రవీందర్, ఐటీ కోర్ టీం ఇన్ చార్జి రాము, పోలీస్ అధికారులు కనుకయ్య, నతానియల్ నటేష్ తిరుపతిగౌడ్, సత్య పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *