ప్రతి జిల్లాకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్

kcr may day

-రవీంద్రభారతిలో ఘనంగా కార్మిక దినోత్సవం

హైదరాబాద్ :  యువతకు ఉపాధినిచ్చేందుకు మంచి కోర్సుల్లో ప్రతీ జిల్లాకు ఒక స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. మే డే దినోత్సవాన్ని రవీంద్రభారతిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ యువతకు, కార్మికులకు పని దొరికినప్పుడే నిరుద్యోగం తగ్గి అభివృద్ది చెందుతారన్నారు.

kcr

చైనా దిగుమతుల వల్ల మన పరిశ్రమలు మూతపడుతున్నాయని..వాటిని నియంత్రించి ఇక్కడి పరిశ్రమలకు చేయూతనివ్వాలని సూచించారు. అలాగే కార్మిక పీఎఫ్, ఈఎస్ఐ నిధులు భారీగా బ్యాంకుల్లో మూలుగుతున్నాయని.. వాటిని యువతకు ఉపాధినిచ్చేందుకు పరిశ్రమలు పెట్టాలని కార్మిక మంత్రి దత్తాత్రేయ సూచించారు.

ఐటీ ఇండస్ట్రీ, మిగతా హార్డ్ వేర్ పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణలో ఇక కరెంటు కోతలుండవని.. వచ్చే మర్చి వరకు 9 గంటల కరెంటు రైతులకు ఇస్తామన్నారు. పరిశ్రమలకు ఇక కోతలుండవని కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని త్వరలోనే లాంఛ్ చేస్తామని.. ఆ తర్వాత అంతా ఆన్ లైన్ విధానమేనని తెలిపారు. ఎక్కడ అవినీతికి అస్కారం లేదన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోం, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కార్మకి శాఖ అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *