ప్రతిరోజు డ్రోన్ కెమెరా కన్నులకు చిక్కుతున్న మందుబాబులు

కరీంనగర్ లో మందుబాబుల పట్టివేత పరంపర కొనసాగుతూనే ఉంది. డ్రోన్ కెమెరాలు ప్రవేశపెట్టి గత వారం రోజులుగా ప్రతిరోజు పది నుంచి ఇరవై మంది మందుబాబులను కరీంనగర్ పోలీసులు పట్టుకుని ప్రజల ప్రశంసలను అందుకుంటున్నారు. సోమవారం నాడు రేకుర్తి, కొత్త పల్లి, మల్కాపూర్, నగునూరు ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ ను ప్రయోగించారు. డ్రోన్ కెమెరాల ద్వారా  అందిన ఛాయాచిత్రాల ఆధారంగా సదరు బహిరంగ ప్రాంతాలలో పోలీసులు మెరుపు దాడి జరిపి ఏడుగురు మందుబాబులను అరెస్టు చేశారు. అరెస్త్ట్ర్రెన మందుబాబుల వివరాలు ఇలా ఉన్నాయి. నగునూరుకు చెందిన బిడ్డుల వేణు, కొత్తపల్లి కి చెందిన నూసన్ శేఖర్, దేశ్ రాజ్ పల్లికి చెందిన వేముల మూర్తి, మల్కాపూర్ కు చెందిన కొనబోయిన పెద్దులు, పెరుమాండ్ల అశోక్, గోలి వంశీ,  కంతాల కృష్టారెడ్డిలను అరెస్టు చేశారు. వీరిపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయని ఎస్ఐ రమేష్ తెలిపారు.
అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పోలీసుల ప్రత్యేక దాడులు
కరీంనగర్ కమీషనరేట్ లో అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు కొనసాగిస్తున్న దాడులు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. సోమవారం నాడు జరిగిన దాడుల వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ టూటౌన్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు అంబర్ ప్యాకెట్లను విక్రయిస్తున్న చాడ మూర్తిని అరెస్టు చేశారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బావుపేటలో ఒక కిరాణం దుకాణం పై దాడి జరిపి ఒకవ్యక్తిని అరెస్టు చేసి 3275 రూపాయల విలువగల గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. సైదాపూర్ మండలంలోని ఆకునూరులో ఒకవ్యక్తిని అరెస్టు చేసి 1900 రూపాయల విలువ చేసే పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని అశోక్ నగర్ లో ఒక వ్యక్తిని అరెస్టు చేసి 1500 రూపాయల విలువగల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ గ్రామం శ్రీపురం కాలనీలో ఒక కిరాణం దుకాణం పై దాడి జరిపి ఒక వ్యక్తిని అరెస్టు చేసి 2100 రూపాయల విలువగల నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ టూటౌన్ పరిధిలోని గోదాంగడ్డలో గుట్కా విక్రయాలు జరుపున్న గుండ పాపయ్యను అరెస్టు చేశారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగాపూర్ లో  మర్రిపల్లి రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 1610 రూపాయల చేసే గుట్కా విక్రయాలు జరుపుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. గన్నేరువరంలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి 1150 రూపాయల విలువగల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపల్లి ఫ్త్లెఓవర్ వద్ద టీస్టాల్ లో బిశ్వంత్ బిస్వాల్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 1445 రూపాయల విలువగల గుట్కా, అంబర్  ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుర్తి శివారులో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి 1600 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీనగర్ లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి 28,480 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

drone camera     drone camera 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.