
రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆశయాలకనుగుణంగా తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్ధలలో చదువుకున్న విద్యార్ధిని విద్యార్ధులు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన IIT,NIT,NIFT లాంటి సంస్ధల్లో సీట్లు సాధించి గర్వకారణంగా నిలిచారని
రాష్ట్ర షెడ్ఢ్యూల్డుకులాల అభివృద్ధి సంక్షేమ శాఖామాత్యులు శ్రీ జి.జగధీశ్ రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక సంస్ధలో సీట్లు పొందిన విద్యార్ధులకు ల్యాప్ టాప్ లు అందించారు. ఈ కార్యక్రమంలో షెడ్డ్యూల్డు కులాల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ మిశ్రా, గురుకుల విద్యాలయాల సంస్ధ కార్యదర్శి శ్రీ ఆర్.ఎన్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. దేశంలో IIT,NIT,IISM,NIFT,Delhi University లలో తెలంగాణ గురుకుల విద్యార్ధిని విద్యార్ధులు సీట్లు సాధించడం గొప్ప విషయమని, అవకాశం ఇస్తే ఆకాశమే హద్దని నిరూపించారని ఆయన అన్నారు. ఈ విజయానికి కారణమైన సిబ్భందిని ప్రత్యేకంగా మంత్రి శ్రీ జి. జగధీశ్ రెడ్డి అభినందించారు.
తెలంగాణలోనే విద్యార్ధిని విద్యార్ధులకు నాణ్యమైన విద్యతో పాటు కెజి నుండి పిజి వరకు ఉచిత విద్యనందించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకునేలా ఉండాలన్న ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి సంకల్పానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి జగధీశ్ రెడ్డి అన్మారు. తెలంగాణ గురుకుల విద్యార్ధులు మంచి ప్రతిభ కనబరచి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సెక్రటరీ, అధ్యక్షులు, ప్రిన్సిపాల్, టీచర్లు అందించిన కృషికి ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి విద్యావకాశాలు ఉండాలన్న భావంతో ప్రభుత్వం గురుకులాల సంఖ్య పెంచడంతో పాటు, మంచి భోజన వసతిని అందిస్తున్నాయని అన్నారు. అందరికి అన్ని అవకాశాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆశయమని అన్నారు. తెలంగాణ గురుకులాలవిద్యార్ధిని,విద్యార్ధులు ఉన్నత విద్యాసంస్ధలో మంచి ప్రతిభ కనబరచి జీవితాల్లో ఉన్నతస్ధానం పొందాలని అభిలాషించారు. ఎస్.సి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ మిశ్రా మాట్లాడుతూ సాంఘీక సంక్షేమ శాఖామాత్యుల సారధ్యంలో మంచి ఫలితాలు సాధించడంలో కృషి చేసిన అధ్యాపక సిబ్భందికి కృతజ్ఞతలు, ప్రతిభ చూపించిన విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపారు.