
తెలంగాణలో తొలి ప్రతిపక్షాలన్నీ కలిసి చేస్తున్న బంద్ ఈరోజు ఉదయం నుంచి ఉధృతంగా తెలంగాణలో జరుగుతోంది. ఈ బంద్ లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం లు కలిసి బంద్ విజయవంతానికి కృషి చేస్తున్నాయి.. హైదరాబాద్ లో బంద్ ను టీడీపీ, బీజేపీలు మానిటరింగ్ చేస్తున్నాయి.. ఆయా నియోజకవర్గాల్లో నియోజకవర్గ బాధ్యులు ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్నాయి.
ఖమ్మం, కరీంనగర్ బస్టాండ్ లవద్ద ప్రతిపక్షాలు మోహరించి ధర్నా చేస్తున్నాయి. రైతుల రుణమాఫీని ఒకే సారి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.