Breaking News

ప్రతిపక్షాలు బీకేర్ ఫుల్.. ఏడాది సస్పెన్షన్

7-3a1

అల్లరి చేస్తే అంతే సంగతులు..  ఏడాది సభకు దూరం చేసేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలకు దిగబోతోంది. తెలంగాణ అసెంబ్లీ రూల్స్ కఠినతరం అవుతున్నాయి.. విపక్షాల అల్లరికి చెక్ చెప్పేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని అసెంబ్లీ రూల్స్ కమిటీలో పొందుపరిచారు.  ప్రతిపక్షాలు గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటే కనీసం ఏడాది సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.  ఉమ్మడి రాష్ట్రంలో సైతం తీసుకోని ఈ నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఉమ్మడి అసెంబ్లీ ప్రతిసారి రణరంగాన్ని తలపించేది.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేవారు. టీఆర్ఎస్ ఉద్యమనేత హరీష్, ఇతర సభ్యులు కాగితాలు చించి, కూర్చీలు విరగొట్టి నానా భీభత్సం చేశారు. అదే ఉద్యమ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అల్లరి చేసే వారే ఇలా ఇప్పుడు కఠిన నిబంధనలతో ప్రతిపక్షాలకు చెక్ పెడుతున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *