
తుమ్మల పాలేరు ఉప ఎన్నికల్లో దూసుకుపోయారు.. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తుమ్మలకు ప్రతిపక్షాలైన టీడీపీ, వైసీపీ, సీపీఎం సహా అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. టీఆర్ఎస్ ఒంటరిగా పోటీచేశాయి. అయినా కూడా టీఆర్ఎస్ 45750 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సుచిరిత రెడ్డిపై ఘన విజయం సాధించారు.ఆయన ప్రతీ రౌండ్ కు దాదాపు 4వేల మెజార్టీ సాధించి ఎక్కడ కూడా కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వలేదు. టీఆర్ఎస్ విస్తృత ప్రచారం బాగా కలిసి వచ్చింది.. కేటీఆర్, తుమ్మల, మంత్రుల మోహరింపుతో టీఆర్ఎస్ కు ఏకపక్ష విజయం దక్కింది..
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ సీటులో కాంగ్రెస్ నుంచి సుచిరిత, టీఆర్ఎస్ నుంచి మంత్రి తుమ్మల పోటీచేయగా.. సానుభూతి నేపథ్యంలో ప్రతిపక్షాలన్ని కాంగ్రెస్ కే మద్దతిచ్చాయి. అయినా కూడా కేటీఆర్, ఇతర మంత్రులు ప్రచారహోరులో టీఆర్ఎస్ దాదాపు 45వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించడం గమనార్హం.
కాగా పాలేరు గెలుపు టీఆర్ఎస్ గెలుపు అని పాలేరును అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని గెలిచిన అనంతరం తుమ్మల విలేకరులతో చెప్పుకొచ్చారు.