ప్రతిపక్షం పని అయిపోయినట్టే..

HY19_T-CONGRESS_1491173f

కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇచ్చింది.. కానీ తెలంగాణలో ఎలా ఓడిపోయింది.. అది స్వయంకృతాపారాధం.. ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా నాన్చి.. నాన్చి ప్రజల్లో వ్యతిరేకత కొనితెచ్చుకుంది. చివరకు తెలంగాణ ఇచ్చినా ఎన్నికల్లో ఓడిపోయింది.. సరే..

ఇక ఇప్పుడు వరంగల్ ఎన్నికల్లో కూడా సరిగ్గా వ్యవహరించలేక టీఆర్ఎస్ ముందు బొక్కా బోర్లా పడింది.. కనీసం సరైన అభ్యర్థిని దించడంలో కూడా వ్యూహాలు పన్నలేక చతికిలపడింది.. రాజయ్యను ఎంపీ క్యాండిడేట్ అనుకొని చివరకు ఆయన కోడలు , మనవళ్ల మరణంతో చివరి నిమిషంలో అభ్యర్థిని హైదరాబాద్ నుంచి మోసుకొచ్చింది. వరంగల్ అభ్యర్థులను కాదని స్థానికేతరుడైన సర్వేకు టికెట్ ఇచ్చి తన ఓటమిని తానే కొనితెచ్చుకుంది.. దీంతో వరంగల్ లోక్ సభ పరిధిలో ని కాంగ్రెస్ నాయకులే నాన్ లోకల్ అంటూ సర్వేకు ఓటు వేయని పరిస్థితి నెలకొంది. అసంతృప్తులు రాజ్యమేలుతున్న కాంగ్రెస్ లో చేసిన తప్పిదాలు చివరకు ప్రజల ఛీత్కారాల దాక వెళ్లి కనీసం డిపాజిట్ దక్కకుండా చేశాయి..

తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఫెయిల్ అయ్యింది. కనీసం కూడా వరంగల్ లో పోటీ ఇవ్వలేక ప్రతిపక్షం పలాయనం చిత్తగించింది.. బీజేపీ , కాంగ్రెస్ లకు దాదాపు సమాన ఓట్లు వచ్చాయంటే కాంగ్రెస్ ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.. ఇలానే కొనసాగితే కాంగ్రెస్ ను ఖతం చేసేస్తారు రాజకీయ దురందురుడు కేసీఆర్..

సో కాంగ్రెసోళ్లు.. తస్మాత్ జాగ్రత్త..?

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *