
ప్రముఖ నిర్మాత దిల్ రాజు గుణశేఖర్ కు దన్నుగా నిలబడ్డారు. రుద్రమదేవి సక్సెస్ మీట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, అల్లు అర్జున్, సీతారామాశాస్త్రి, అనుష్క,దర్శకుడు గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుద్రమదేవి తెలంగాణ పంపిణీ దారుడు దిల్ రాజు మాట్లాడుతూ గుణశేఖర్ రుద్రమదేవి తరువాత ప్రతాపరుద్రుడు సినిమా తీస్తే తాను నిర్మిస్తానని ప్రకటించారు. దీంతో సభావేదికపై హర్షం వ్యక్తమైంది.
అనంతరం మాట్లాడిన దర్శకుడు గుణశేఖర్ తన ప్రతాపరుద్రుడు సినిమాకు నిర్మాత దొరికాడని.. దిల్ రాజు నిర్మిస్తే తాను మరింత బాగా సినిమా తీస్తానని కళ్ల నుంచి నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడారు.