ప్రజా సేవకే సివిల్ సర్వీస్

– అం.ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబు
హైదరాబాద్ : ప్రజా సేవ చేయాలనుకునే వారే సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు వస్తారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి లాల్‌బహదూర్‌శాస్ర్తి అకాడమీలో ట్రైనీ ఐఏఎస్‌లను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఉదయం హైదరాబాద్ నుంచి డెహరాదున్ వచ్చిన సియం అక్కడ నుంచి ముస్సోరిలోని ఐ ఎ ఎస్ ల శిక్షణ కేంద్రము చేరుకుని సుమారు 3 గంటలపైన గడిపారు. రాష్ట్రాభివృద్ధికి యువ ఐఏఎస్ లు సలహాలు సూచనలు ఇస్తే అమలు పరుస్తానన్న అయన ఐఏఎస్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.

ప్రజాసేవ చేయాలనుకునేవారే సివిల్స్‌ను ఎంచుకుంటారని.. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి విషయాన్ని నేర్చుకోవాలని ఆయన సూచించారు. బాగా కష్టపడి పనిచేస్తే మీరనుకున్న లక్ష్యానికి చేరువవడమే కాకుండా వ్యక్తిగతంగానూ ప్రజలకు ఉపయోగపడేలాగుంటుందని తెలిపారు. ఇప్పటివరకు పబ్లిక్ మీటింగులలోనే మాట్లాడే వాడినని, ఇప్పుడు ఐఏఎస్ ల ముందు మాట్లాడడం సంతోషంగా వుందని అన్నారు. నా 9 సంవత్సరాల ఉమ్మడి రాష్త్ర పాలన కాలంలో సంస్కరణలలో కానీ, సంక్షేమ పధకాలలో కానీ నావిజయం వెనుక ఐఏఎస్ ల పాత్ర ఎంతో వుందన్నారని పొగిడారు. దేశంలో మేథావి విద్యార్థులంతా సివిల్స్‌కు పోటీ పడతారని పేర్కొన్నారు. కష్టపడి పనిచేస్తే డబ్సు సంపాదన కష్టం కాదన్నారు.

రాష్త్రము విడిపోయిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక లోటు ఎదుర్కొంటున్నప్పటికి ఆంధ్ర ప్రదేశ్ కి సహజ వనరులు సమృద్ధిగా వున్నాయని, వీటితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఏపి కి వున్నా సముద్ర తీర ప్రాంతము మరే రాష్ట్రమునకు లేదని అభిప్రాయ పడ్డారు. ఇది భారత దేశ ఆర్ధిక వ్యవస్థకు ముఖ ద్వారము అవుతుందని తెలిపారు. ఏపి కొత్త రాజధాని అమరావతికి కృష్ణ నది పరివాహక ప్రాంతము ఏపికి అదనపు బలమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ను అభివ్రుద్ధి పధంలో నడపడమే తన లక్ష్యమని ముఖ్య మంత్రి అన్నారు.

దాదాపు 30 ఏళ్ల తర్వాత నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలో బీజేపీకి పూర్తిస్థాయి ఆధిక్యం వచ్చిందని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. ప్రపంచ వ్యాప్తంగా దక్షిణ కొరియా, సింగపూర్‌, హాంకాంగ్‌, చైనా దేశాలు మాత్రమే రెండంకెల వృద్ధి సాధించాయని, చైనా అభివృద్ధిని తాను ప్రత్యక్షంగా పరిశీలించానని ట్రైనీ ఐఏఎస్‌లకు చంద్రబాబు వివరించారు. సముద్ర వనరులను చైనా సమృద్ధిగా వినియోగించుకుంటోందని చెప్పారు. సముద్రంలో 33 కి.మీ మేర చైనా ఫ్లై ఓవర్‌ నిర్మించిందని, ఈ దూరాన్ని కేవలం 7 నిమిషాల్లోనే చేరుకుంటారన్నారు.

ఐఎయస్ ట్రైనీస్ అడిగిన ప్రశ్నలకు సీయం ఓపికగా సమాధానం చెప్పారు. ఒక ట్రైనీ విడిపోయిన 2 రాష్త్రాలు భవిష్యత్తులో మళ్ళా కలుస్తాయని భావిస్తున్నారా అని ప్రశ్నించినపుడు సభలో నవ్వులు విరబూశాయి. దీనికి స్పందించిన ముఖ్య మంత్రి విభజన గడిచిన చరిత్ర అన్న అయన రెండు తెలుగు రాష్త్రాలు అభివృద్ధిలో ముందుకెళ్ళాలని కోరుకుంటునట్లు తెలిపారు. అనంతరము నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *