
ప్రజా సేవకు ఉన్నత ఉద్యోగం వదిలి పల్లెబాట
-రాజకీయాల్లోకి వచ్చిన చిగురుమామిడి యువకుడు..
కరీంనగర్, ప్రతినిధి : మనసులో అదే ఆశ.. ఎన్నటికైనా ప్రజాసేవ చేయాలనే తపన.. ఆరుగాలం శ్రమించిన నాన్న పట్టుదల అతడిని చదువులో రాణించేలా చేసింది. పట్టుదలతో చదివి దేశంలోనే ప్రముఖ NIITలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించాడు.ఇక తనలో చిన్నప్పటినుంచి గూడుకట్టుకుని ప్రజాసేవ చేయాలనే లక్ష్యం కోసం తపించాడు.. తెలంగాణ స్వప్నం సాకారం అయిన వేళ లక్షల ఉద్యోగం వదిలి ప్రజాసేవకై పల్లెబాట పడ్డారు. చిన్పప్పటినుంచి నాయకత్వ లక్షణాలున్న అతడు ఇప్పడు యువరక్తంతో రాజకీయాల్లో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టేందుకు ముందుకు సాగుతున్నాడు..
కరంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన పొన్నం శ్రీనివాస్ కు చిన్నప్పటినుంచి నాయకత్వ లక్షణాలు ఎక్కువే. నాన్న పడిన కష్టం తెలిసిన శ్రీనివాస్ ఎప్పడు చదవులో వెనకంజ వేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఢిల్లీలోని NIITలో ఉద్యోగం సంపాదించాడు. లక్షల వేతనాన్ని పొందాడు. తదనంతరం తాను చిన్నప్పటినుంచి శ్వాసగా చేయాలనుకున్న ప్రజాసేవే లక్ష్యంగా అడుగులేశాడు. నవ తెలంగాణ స్వప్నం సాకారం చేసిన వేళ .. నవతరం ప్రతినిధిగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగాడు. కుటుంబంలో సంప్రదిస్తే ముందు వద్దన్నా.. ఆ తర్వాత శ్రీనివాస్ ప్రతిభను చూసి సరేనన్నారు.
దీంతో గడిచిన స్థానిక ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీచేశాడు.. NIITలో చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలో నిలిచాడు. ఒక ఉన్నతోద్యోగం వదిలి వచ్చిన ఈ యువకుడని జనం నోళ్లలో నానాడు.. రాజకీయాల్లో మార్పు సాధ్యమని చాటి చెప్పాడు.. కానీ తాను గెలవకున్నా.. ప్రజల మనుసులను మాత్రం గెలిచాడు. గతసారి ఓడిపోయినా.. భవిష్యత్ పై ఆశతో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు. తన కలలు గన్న ప్రజాసేవకు వడివడిగా అడుగులు వేస్తున్న పొన్నం శ్రీనివాస్ గెలవాలని.. మన చట్టసభల్లో ఒక ఉన్నత విద్యావంతుడు ప్రవేశించాలని ఆశిద్దాం.. ఆల్ ది బెస్ట్ టు పొన్నం శ్రీనివాస్..