Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే నాధ్యేయం: మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్

ప్రజా సమస్యల పరిష్కారమే నాధ్యేయం: మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాను నిరంతరం పని చేస్తున్నట్లు రాష్ట్ర్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. శక్రువారం  సనత్ నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్ పేట డివిజన్ లో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా మెక్లెడ్ గూడలోని ప్రాధమిక పాఠశాలలో 7.60 లక్షలతో చేపడుతున్న ప్రహరీగోడ  నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్ధులతో కొద్దిసేపు ముచ్చటించి పలు ప్రశ్నలను అడిగి విద్యార్ధుల నుండి సమాధానాలను రాబట్టారు. పాఠశాలలో అదనపు టాయిలెట్లు కావాలని  మంత్రిని కోరగా, వెంటనే టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. తదనంతరం నల్లగుట్టలో 9.60 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటిహల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆప్రాంత  మహిళలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తమకు సరఫరా అవుతన్న త్రాగునీరు కలుషితం అవుతున్నాయని మంత్రికి విన్నవించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నూతన పైప్ లైన్ నిర్మాణం చేపట్లాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. జాలమ్మగుడివద్ద ఉన్న నాలాలో పూడిక తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలు తమ  సమస్యను నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ అతెల్లి అరుణ్ గౌడ్, జోనల్ కమీషనర్ శంకరయ్య, డిసి శైలజ, డిఈఓ వెంకటనర్సమ్మ, ఈఈ సురేష్, డిప్యూటి ఐఓఎస్ వేణుగోపాలచారి, వాటర్ వర్క్స్ డిజిఎం సునీల్, టౌన్ ప్లానింగ్ ఏసిపి రాజెందర్, స్ట్ర్రీట్ లైట్స్ డిఈ మహేష్, హర్టికల్చర్ అధికారి మహేందర్, ప్రధానోపాద్యాయురాలు  జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

talasani srinivas yadav 1     talasani srinivas yadav 2     talasani srinivas yadav 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *