Breaking News

ప్రజాస్వామ్యంలో రాజాధిరాజు!

kcr

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో ఇది మర్చిపోతున్నారు. ప్రజాస్వమ్యంలో ముఖ్యమంత్రిలా కాకుండా, రాచరికంలో రాజులా ప్రవర్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తుండగా ఓ రైతు ఒక ప్రశ్న వేశాడు. తోటపల్లి రిజర్వాయర్ సంగతి ఏమైందని అడిగాడు. అదేం నేరం కాదు. కానీ కేసీఆర్ కు పట్టరాని కోపం వచ్చింది.

తీవ్ర పదజాలంతో ఆ రైతును మందలించారు. కనీసం అది బహిరంగ సభ అని, ఒక వ్యక్తిని దూషించడం తప్పని కూడా కేసీఆర్ ఆలోచించలేదు. సభా మర్యాద కాపాడాలనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఇక ఆయన వీర విధేయులైన పోలీసులు ఊరుకుంటారా. సదరు రైతు ఏదో ఘోరమైన నేరం చేసినట్టు అదుపులోకి తీసుకున్నారు.

కడతానన్న ప్రాజెక్టు పని ఏమైందని ప్రశ్నించడం నేరమా? ఎన్నికలప్పుడు ఊరూరా తిరిగి అమ్మా, అయ్యా ఓటెయ్యండని అడగలేదా? మరి కేసీఆర్ కు అంత కోపమెందుకో అర్థం కాదు. ఈ మధ్య జనం మీద కసురుకోవడం, స్థానిక విలేకర్లను చులకనగా చూడటం పరిపాటిగా మారింది.

ఇప్పుడంటే అధికారం ఉంది. ఎన్నికల ప్రచార సమయంలోనూ కేసీఆర్ ఇదే పోకడ అనుసరించారు. కొన్ని చోట్ల కేసీఆర్ ను దగ్గర నుంచి చూడాలనే అత్యుత్సాహంతో యువకులు స్తంభం ఎక్కడం, లేదా పక్కవారిని తోసుకుంటూ రావడం చూసి వారిని కేసీఆర్ తిట్టిన సందర్భాలున్నాయి. నిండు బహిరంగ సభలో ఇడియట్ అని యువకులను తిట్టడం ఏమిటని జనం ఆశ్చర్యపోయిన సంఘటనలున్నాయి.

కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం ఆయన బలహీనత అని సర్దిచెప్పుకోలేం. ముఖ్యమంత్రి స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులను సన్నాసి అంటారో ఇంకేమని తిట్టుకుంటారో ఆయనిష్టం. కానీ తనకు పదవి రావడానికి కారణమైన ప్రజలను బహిరంగ సభలోనే తిట్టడం ఎంతవరకు సబబో కేసీఆర్ ఆలోచించాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *