ప్రజాసమస్యలపై సమరం మోగించిన సారంగపాణి

ప్రజాసమస్యలపై సమరం మోగించిన సారంగపాణి
నియోజకవర్గం లోని ప్రజా సమస్యలపై టీ.డీ.పి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మేకల సారంగపాణి సమరం మోగించారు. మెట్టుగూడా డివిజన్ పరిధిలోని లాలగూడా రైల్వే ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో డివిజన్ కార్యదర్శి తడక వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలు తిష్టవేచి కూర్చునట్లు గుర్తించి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మెట్టుగూడా రైల్వే ఆస్పత్రి వద్ద గల ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులకు చాలా ఇబ్బంది కరంగా మారిందన్నారు. ఆ రోడ్డులో ప్రయానం నరకానికి దారి అన్న చందంగా ఉందన్నారు. అధికారులు నామమాత్రపు చర్యలు చేపట్టి మామూళ్ళతో కూడిన మరమ్మత్తు చర్యలు చేపట్టిన నాలుగు రోజుల్లోనే మళ్లీ IMG-20180503-WA0122గుంతలు పడి దుమ్ము దూళితో నిండిపోయిన రోడ్డులో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. అనునిత్యం ప్రమాదాలు జరుగుతున్న అధికారులకు, ప్రజా ప్రతినిధులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర IMG-20180503-WA0126IMG-20180503-WA0125ప్రభుత్వాలు విఫలం చెందాయనడానికి ఇదే ఉదాహరణ అన్నారు. ఆ రోడ్డు మాపరిధిలోకి రాదని జీ.హెచ్.ఎం.సి అధికారులు చెబుతుంటే, రైల్వే అధికారులు కూడా మా పరిధి కాదంటూ చేతులు దులుపుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అనునిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే రోడ్డు దుస్థితి ఇలా ఉంటే బస్తీలో రోడ్ల పరిస్థితి ఊహించలేమన్నారు. స్థానిక మంత్రికి కూడా ఇలాంటి సమస్యలు కనిపించకపోవడం దురదృష్టమన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్యతో ప్రజలు బాధపడుతున్న మంత్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. మరమ్మత్తులు పేరుతో కోట్లాది ప్రజాధనం వృధా చేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వాలకు ప్రజలే సరియైన బుద్ది చెప్తారన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులలో చలనం రాకపోతే టీ.డీ.పి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీ.డీ.పి సీనియర్ నాయకులు కొమురయ్య, భాస్కర్ ముదిరాజ్, శశిరేఖ, చందర్, జగదీష్ గౌడ్, క్రిష్ణ పూజారి, మేకల హర్షకిరన్, కె.విజయ్ కుమార్, చందర్ , శివప్రసాద్ వేణు, రాపోలు సురేష్, జెట్టి యాదగిరి, బాబు నాయుడు, గుంటి నరేష్, యాదగిరి, నర్సింహ, రాజేష్ నాయుడు,మార్టిన్, కె.శ్యామ్, కృష్ణ, నర్సింహ ముదిరాజ్, ప్రేమ్, నాగమణి, రామారావు, ఎమ్. రాజు, అనిల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *