ప్రజాసమస్యలకు వెంటనే పరిష్కారం

కరీంనగర్ (పిఎఫ్ ప్రతినిధి): డయల్ యువర్ కలెక్టర్లో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు మండలాల నుంచి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున సమస్యలు కలెక్టర్ దృష్టికి వచ్చాయి. ప్రజా సమస్యలపై స్పందించి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి వీరబ్రహ్మయ్య, డిఆర్ డిఎపడి అరుణశ్రీ, పిడి డ్వామా వైవి గణేష్, జడ్పీ సిఇవో సూరజ్ కుమార్, పిడి హోజింగ్ నర్సింహారావు, జిల్లా ప్రణాళిక అధికారి సుబ్బారావు, వ్యవసాయ సంయుక్త సంచాలకులు చత్రు నాయక్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా అలీం, ఆర్ డి ఓ చంద్రశేఖర్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *