
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవం పెంచేందుకు వారి ఇక్కట్లను దూరం చేసేందుకే వారి జీతాలు పెంచామని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో కేరళ తర్వాత ప్రజాప్రతినిధులకు జీతాలు పెంచింది తెలంగాణనే అని సీఎం అన్నారు. శనివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
తెలంగాణ హైకోర్టు విభజన రెండు మూడు రోజుల్లో ప్రకటన వెలువడుతుందని.. తాను న్యాయశాఖ మంత్రి సదానందతో మాట్లాడి నిర్ధారించుకున్నానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ లో ఇప్పటివరకు కోతలు లేవని.. ఇదేరోజు గత ఏడాది కరెంటు కోతలతో జనం , పారిశ్రామికవేత్తలు రోడ్డుపై ధర్నాలు చేశారని.. కానీ దేవుని దయ వల్ల ఈ సంవత్సరం ఇప్పటివరకు కోతలు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో రానున్నరోజుల్లో కరెంటు కోతలు ఉండవని హామీ ఇచ్చారు. తెలంగాణ బడ్జెట్ సందర్భంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన పూర్తి పాఠం వీడియో రూపంలో పైన చూడొచ్చు.