
సర్పంచ్ లు, ఎంపీటీసీలు.. వీరి జీతం ఎంతో తెలుసా అక్షరాల 700 రూపాయలు. కనీసం ఉపాధి హామీ కూలీకి వెళ్లిన 6000 వేల జీతం నెలనెలా వస్తుంది. దీనిపై కిందిస్థాయి నుంచి మీదనున్న జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీచైర్మన్ వరకూ కూడా ప్రజాప్రతినిధులు ఎప్పుడు మథనపడుతూనే ఉంటారు. దీనిపై నిన్ననే మంత్రి కేటీఆర్ జరిగిన సమావేశంలో సర్పంచ్ లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తక్షణం స్పందించిన ఆయన సర్పంచ్ ల వేతనాలు పెంచేందుకు హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి నిర్ణయిస్తానన్నారు. అనుకున్నదే తడవుగా నిన్న సమావేశం జరిగింది. నేడు నిర్ణయం అమలైంది. ప్రజాప్రతినిధులకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళ్లు చెదిరేలా పెరిగిపోయాయి వారీ జీతాలు చూస్తే బైర్లు కమ్మేలా.. ఒక్కొక్కరిది ఊహించనంతగా పెరిగిపోయింది.
ప్రజాప్రతినిధులకు పెరిగిన వేతనాలు :
జడ్పీచైర్మన్ కు 7500 వేల నుంచి లక్ష కు పెంపు
జడ్పీటీసీ 2500 నుంచి 10వేలు ,
ఎంపీపీకి 1500 నుంచి 10వేలు
సర్పంచ్, ఎంపీటీసీలకు 750 నుంచి 5000
మేయర్ లకు 14 వేల నుంచి 50వేలు
డిప్యూటీ మేయర్ కు 8వేల 25వేలు
కార్పొరేటర్లు కు 6000
స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ చైర్మన్ కు 35000
కౌన్సిలర్లు 2500
మున్సిపల్ చైర్మన్ 12 వేలు
వైస్ చైర్మన్ 5వేలు జీతాలను పెంచారు.
ఈ జీతాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు జీతాలు పెంచడంపై ప్రతిఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచడంవల్ల అవినీతి తగ్గిపోతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.