ప్రజాప్రతినిధులకు జీతాల పెంపు కరెక్టా..? రాంగా.?

ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు జీతాలు పెంచడం కరెక్టా..? రాంగా.? అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎక్కువశాతం ప్రజా ప్రతినిధులు రాజకీయాల్లో నీతి నిజాయితీలతో ఉన్నారా అంటే లేదనే చెప్పొచ్చు.. భారీగా డబ్బు ఖర్చు పెట్టనిదే గెలవలేని పరిస్థతి.. మరి కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే ఇంకా కోట్లు సంపాదించకుండా ఉంటాడా..?. అక్రమాలకూ , అవినీతికి పాలుపడేవాళ్లు ఉంటారా ఈ రోజుల్లో.. ఈ విషయం బహిరంగ రహస్యమే . పెద్ద పెద్ద కుంభకోణాల నుండి  చిన్న చిన్న కాంట్రాక్ట్ల్ కమీషన్ల వరకు ప్రజాధనాన్ని పెద్ద మొత్తంలో దోచుకునే వాళ్లకు పెంచబోయే  జీతాలు బఠానీలతో సమానం. వాళ్ళు అలవాటుపడ్డ జీవన విధానానికి విలువైన  ఆస్థుల కొనుగోలుకు, అంతర్జాతీయ టూర్లకు, ఎన్నికల్లో పెట్టిన ఖర్చులను రాబట్టుకోడానికి, మళ్లీ ఎన్నికల్లో నిలబడడానికి పార్టీ టికెట్ కొనుగోలుకు, ఓటర్లకు డబ్బుతో పాటు మందు సరఫరా చేయుటకు ప్రభుత్వం పెంచే జీతాలు అసలేం సరిపోతాయి? కోట్లల్లో ప్రజాసోమ్మును దోచుకునే అలవాటుపడ్డ ఈ పానాలకు ప్రభుత్వం పెంచాలనుకున్న జీతాలు ఏం సరిపోతాయి, చిన్న టిప్పుతో సమానం!

అవినీతికి పాల్పడకుండా, నిజాయితీగా ప్రజా సేవకే అంకితమైన ప్రజాప్రతినిధులకు జీతాలు పెంచడం సబబే, కాని అలాంటివారు అసలు ఉన్నారా ఈరోజుల్లో? అలాంటివారికి  పోటీ చేయడానికి టికెట్ దొరుకుతుందా ?  దేశంలో ఉన్న అన్ని పార్టీలను, ప్రజా ప్రతినిధులను తప్పుపట్టలేము కాని దాదాపు 90% వాళ్ళు టికెట్లు కొని ఓటర్లకు డబ్బులు పంచి గెలిచే వాళ్ళే . ఈ ప్రతినిధుల రాజకీయ ప్రవేశమే  అవినీతితో మొదలవుతున్నది. పార్టీ టికెట్ ల కొనుగోలు,ఓటర్ల కొనుగోలు నుండి మొదలుపెడితే డబ్బులకో లేదా పదవులకో ఆశపడి అమ్ముడుపోయి   పార్టీలు మారే వరకు వాళ్ళు అవలంభించేవన్నీ  స్వార్థపూరిత దుర్మార్గపు పద్ధతులే. ఇట్లాంటివారికా జీతాలు పెరిగేవి??

ప్రతీనెల జీతాలు తీసుకుంటూ ఒక ఇంచు కూడా అభివృద్ధి పనులు చేపట్టని  మంత్రులకు, గెలిచిన తరువాత ఎన్నడూ కూడా  తమ నియోజకవర్గాలకు సందర్శించి సమస్యల పట్ల స్పందించని   ఎమ్మెల్యేలకు అసలు జీతాలివ్వడమే దండగ ! ఒకవేళ పెంచడమే ఐతే , వాళ్ళ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టండి, ఎవరైనా అవినీతికి పాలుపడితే శిక్ష విధించి పదవి నుండి తొలగించండి. విధుల నిర్వహణలో జాప్యం జరిగితే తగిన చెర్యలు  తీసుకొని అవినీతిరహిత పాలనకు పాటుపడితే మంచిదే. ఈ ప్రయత్నం  జీతాలు పెంచకుండా కూడా చేయవచ్చు  కదా ? ప్రజా సేవ చేసే ఆదర్శ ప్రజా ప్రతినిధులను ఎంపిక చేసి వారిని అభినందించడానికి మంచి పారితోషకాలు ఇస్తే బాగుంటుంది.
ఒకరిని చూసి మరొకరు ఆత్మవిమర్శలు చేసుకొని మంచి దారివైపు మలిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు విధిస్తే తప్ప, అవినీతిరహిత పాలన సాధ్యం కాదు ! మొదలు అవినీతిని అరికట్టి , ఆ తరువాతే జీతాలు పెంచడం గురించి ఆలోచిస్తే మంచిది.

ప్రజాప్రతినిధులకు ఏం తక్కువ ? అడగక ముందే వారి జీతాలు పెంచుతున్నారు ! సఫాయి కార్మికులు జీతాలు పెంచమని ఎన్నెన్నో సమ్మెలు పోరాటాలు చేసినా, వారిపట్ల ప్రభుత్వం ఎన్నో నెలల వరకు మొండిగానే ప్రవర్తించింది .
తెలంగాణా లో సినిమా పరిశ్రమాభివృద్ధికి తెలంగాణా వాళ్ళు, తెలంగాణాలో, తెలంగాణా కళాకారులతో తీసిన సినిమాలకు పన్ను మినహాయింపు, సబ్సిడీలు కేటాయించమని ఎంతమోత్తుకున్నా, పట్టిచ్చుకోని ప్రభుత్వం, ఇక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అడగక ముందే వాళ్లకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారు ? వాళ్ళు  ఏం సాధించారని , ఏ దీన స్థితిలో ఉన్నారని వారి జీతాలు పెంచే పని పెట్టుకున్నారు?

రైతులుకు పథకాలు, విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, కళాకారులకు జీవనోపాధి, పేద జర్నలిస్ట్ లకు  హెల్త్ మరియు అక్రెడెషన్ కార్డ్ లు, నిరుద్యోగులకు ఉపాధి, సామాన్య ప్రజలకు విద్య వైద్య సౌకర్యాలు , భూమి పుత్రులకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తే జనానికి ఉపయోగం. మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలన్నీ  నెరవేర్చి ఆ తరువాతే mla మరియు Mlc ల గురించి అలోచించండి.. అదికూడా వాళ్ళు అవినీతికి పాలుపడడం మానేసినప్పుడే    !

   f2ef41ef-7f71-425e-8347-94f4651db765

– రఫీ

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *