ప్రజల సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలం : టి.డి.పి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల సారంగపాణి

-సీతాఫల్ మండి లో పాదయాత్ర

ప్రజల సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలం అయ్యిందని టి.డి.పి. నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల సారంగపాణి విమర్శించారు. ప్రజా సమస్యలపై సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాస నగర్ లో టీ.డీ.పి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మేకల సారంగపాణి పార్టీ నాయకులతో కలిసి పాద యాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్తీ లోని రోడ్లు గుంతలమయంగా మారి మురుగునీటితో నిండిపోయి మురికి కూపాలుగా మారాయన్నారు. ఎక్కడ చూసినా మట్టి కుప్పలు, చెత్త దిబ్బలతో దుర్గంధం వెదజల్లుతుందన్నారు. నాలా పరివాహక ప్రాంత ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని బాధాకరం వ్యక్తం చేశారు. దుర్గందానికి తోడు దోమలు సైర విహారం చేస్తున్నాయని దీని కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. సమస్యల వలయంలో ప్రజలు కొట్టు మిట్టాడుతున్న, కళ్ళుమూసుకపోయిన గులాబీ పాలకులకు ప్రజా సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు. అభివృద్ధి మాయ మాటలతో ప్రజలను మోసం చేసిన మంత్రి పద్మారావుకు ప్రజా సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణీ తప్ప మంత్రి చేసిందేమీ లేదన్నారు. బస్తీలు లేని నగరంగా మారుస్తామని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రికి మురికి వాడలుగా మారుతున్న అందమైన డివిజన్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న టీ.ఆర్.ఎస్ కు రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెప్తారన్నారు. పాలకులకు తోడు అధికారులు కూడా తానా అంటే తందాన అన్న చందంగా మారారన్నారు.. ఎవరైనా వచ్చి పిర్యాదు చేస్తే గాని స్పందించని అధికారులు మొక్కుబడి మాదిరిగానే చేతులు దులుపు కుంటున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్రీనివాసనగర్ లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీ.డీ.పి సీనియర్ నాయకులు భాస్కర్ ముదిరాజ్, జగదీష్ గౌడ్, చందర్ , జెట్టి యాదగిరి, సుంచు శోభ, శోభ రాణి, భాగ్యమ్మ, దేవమని, సంతోష్, లతీఫ్, సునీల్, నాని, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2018-05-10 at 17.14.27 (1)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *