
వరంగల్: ప్రతిపక్షాలు రైతుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని రాష్ర్ట ఐటి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెల్వకుంట్ల తారకరామారావు అన్నారు. వరంగల్ లో బచ్చన్న పేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ మనవడు తింటున్న బియ్యమే పేద విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. 60 ఏళ్లుగా పోని పేదరికం 15 నెలల్లో పోతుందా అని ప్రశ్నించారు. కోటి ఎకరాలకు సాగునీరందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి తాగు నీరు అందించక పోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని కెసిఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ర్టంలో కరెంటు కష్టాలను అధిగమించడంతోపాటు, మనిషికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందిస్తున్న ఘనత టిఆర్ ప్రభుత్వానిదేనని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.