Breaking News

ప్రజల తీర్పు.. యూరోజోన్ నుంచి గ్రీస్ బయటకు..

lead_960

గ్రీసులో సంక్షోభం మరింత ముదిరింది. యూరోజోన్ లో కొనసాగి వారి నిబంధనలు పాటంచాలా..? లేదా స్వతంత్రంగా వ్యవహరించాలా అన్న ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్ పై ప్రజలు తీర్పు ఇఛ్చారు. యూరోజోన్ నుంచి వైదొలిగి కొత్తగా కరెన్సీ పెట్టుకొని స్వతంత్రంగా వ్యవహరించాలని తీర్పునిచ్చారు. దీంతో ప్రధాని సిప్రస్ పదవి పోకుండా అయ్యింది..

యూరోజోన్ నుంచి భారీగా అప్పు చేసిన గ్రీస్ దేశం.. అప్పుల్లో కూరుకుపోయి వాటిని తీర్చలేని స్థితికి చేరింది. మరిన్ని అప్పులకు యూరోజోన్ ను అభ్యర్థించగా.. యూరోజోన్ చాలా షరతులు పెట్టింది. ఈ షరతుల వల్ల గ్రీస్ ప్రజలు ఉద్యోగాలు పోతాయి. పింఛన్లు పోతాయి.. పొదుపు చర్యల వల్ల సుంకం పెరుగుతుంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతారు. దీనిపై ప్రధాని ఒఫ్పుకోక యూరోజోన్ నుంచి వైదొలగాలా.. కొనసాగాలా అన్న దానిపై ప్రజాభిప్రాయం సేకరణ (ఓటింగ్) జరిపారు.

కాగా దీనిపై 60శాతం ప్రజల యూరోజోన్ షరతులు అంగీకరించవద్దని.. వెంటనే ఆ జోన్ నుంచి వైదొలిగి స్వతంత్రంగా కరెన్సీ పెట్టుకోవాలని రెఫరెండంలో తీర్పు నిచ్చారు.

రెఫరెండంలో ప్రజాతీర్పు వ్యతిరేకంగా వస్తే రాజీనామా చేస్తానన్న ప్రధాని సిప్రస్ ప్రజాతీర్పు అనుకూలంగా రావడంతో ఇక మిగతా చర్యలకు ఉపక్రమించారు. కాగా యూరోజోన్ మాత్రం భారీగా అప్పులిచ్చి ఇప్పుడు గ్రీస్ తప్పుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *