ప్రజలు సంఘంటిత శక్తితో మొక్కలు నాటాలి: ఈటెల

కరీంనగర్: తెలంగాణ హరితహరంలో మొక్కలు నాటే సమయం ఆసన్నమైందని వెంటనే ప్రజలు సంఘంటిత శక్తితో మొక్కలు నాటి పచ్చదనంతో నింపాలని రాష్ట్ర్ర ఆర్ధిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం హుజురాబాద్ లోని సాయి గార్డెన్స్ లో జరిగిన హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులకు తెలంగాణ హరితహరంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుగా మంత్రి మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం మొక్కలు నాటాలని మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత ప్రజలు చేతిలో వుందని అన్నారు. మొక్కలు నాటుట, ప్రతి ఒక్కరి బాధ్యత ప్రజల చేతిలో వుందని అన్నారు. మొక్కలు నాటుట, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. గ్రామాలలో సర్పంచ్ లు, ప్రత్యేక శ్రద్ద తీసుకొని విరివిగా మొక్కలు నాటించి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ప్రజలకు కావాల్సిన మొక్కలు పండ్లు, పూలు నిచ్చే మొక్కలను తీసుకెళ్లి వాటిని నాటి సంరక్షించాలని అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ హరితహరంలో చెట్లను నాటి సంరక్షించుటకు ఉపాధి హమీ పధకం ద్వారా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామాలలో గల రిక్షాలను ఉదయం చెత్తను తొలగించుటకు, సాయంత్రం వెళ్లి మొక్కలకు నీరు పోయుటకు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజలు సహకారంతో ప్రజా ప్రతినిధులు హరితహరంను విజయవంతం చేయాలని ఈ సంవత్సరం నిర్ణయించిన 4 కోట్ల మొక్కలను నాటాలని సూచించారు. జిల్లాలోని నిధులు లేని ఆరు వందల గ్రామ పంచాయితీలకు 10 వేల చొప్పున మంజూరు చేస్తామని వాటిని ట్రీగార్డులకు చెట్ల సంరక్షణకు ఉపయోగించుకోవాలని సూచించారు. దృడ సంకల్పం ఉంటే హరితహరంను విజయవంతం చేయవచ్చునని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 78 శాతం ఐ.ఎస్.ఎల్. నిర్మాణాలు పూర్తి అయినాయని మిగిలిన 22 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు జే.సి. ఎ.నాగేంద్ర, డి.ఎఫ్.ఓ. వినోద్ కుమార్, కె. మహేంద్రరాజు, పిడి డ్వామా గణేష్, జడ్.పి. సి.ఇ.ఓ. సూరజ్ కుమార్, ఆర్.డి.ఓ. చంద్రశేఖర్, డిడి వయోజన విద్యా జయశంకర్, యం.పి.పి.లు, జడ్.పి.టి.సి.లు, సర్పంచ్ లు, తహశీల్దార్లు, యం.పిడి.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.

eatela rajender     eatela

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *