ప్రజలు మార్పు కోరుకున్నారు..

విశాఖపట్టణం, ప్రతినిధి : ప్రజలు మార్పును కోరుకున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. విశాఖలోని ఆనంపురం మండలం గంభీరంలో ఏర్పాటు చేయనున్న ఐఐఎంకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వెంకయ్య మాట్లాడారు. తెలుగు వారందరూ కలిసి కట్టుగా ఉండాలని, ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదన్నారు.

30 ఏళ్ల తరువాత ఒక స్టేబుల్ ప్రభుత్వం ఏర్పడిందని, స్కిల్, స్కేల్, అండ్ స్పీడ్ అని మోడీ పిలుపునిచ్చారని పేర్కొన్నారు. అభివృద్ధికి బ్రేకులు వేయవద్దని సూచించారు. సభను జరగనివ్వమని పేర్కొనడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు పారశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపుతున్నారని, రెడ్ టేప్ లేదు..రెడ్ కార్పెట్ ఉందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..సీఎం చంద్రబాబు నాయుడుపై వెంకయ్య పొగడ్తలు కురిపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.