
-పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు
టీఆర్ఎస్ ప్రభత్వం రాష్ట్ర్రంలో చేపట్టిన ప్రగతికి మరోసారి పట్టం కట్టాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం,అప్పిరెడిపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. గడపగడపకు వెళ్లి టీఆర్ఎస్ కారుగుర్తకు ఓటేయ్యాలని కోరారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేపట్టని అభివృద్ధిని సీఎం కేసీఆర్ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిపిరాన్నారు. ఎక్కడా లేని పథకాలు ప్రవేశపెడుతూ సీఎం కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు.