
పౌరసరఫరాల శాఖ పై సమీక్ష నిర్వహించిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్. హాజరైన కమీషనర్
సీవీ ఆనంద్, పౌరసరఫరాల శాఖ అధికారులు.
కొన్ని జిల్లాల్లో దసరా కు రేషన్ బియ్యం అందించలేకపోవడం పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆర్థిక, పౌరసరఫరాల శాఖా మంత్రి ఈటల. ఈ పాస్ మిషన్ లు అక్రమాలను అరికట్టడానికే గానే అసలైన లబ్దిదారులను ఇబ్బందులు పెట్టడానికి కాదు అని అన్నారు. ఈ -పాస్ మిషన్లు అందిస్తున్న సంస్థ అలసత్వం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, మరోసారి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆ కంపెనీని హెచ్చరించారు.
పౌరసరఫరాల శాఖ ద్వారా అందిస్తున్న బియ్యం అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పాస్ మిషన్ లను అందుబాటులోకి తీసుకు వచ్చిందని మంత్రి ఈటల అన్నారు. మొదట్లో GHMC పరిదిలో దీనిని అమలు చేయాడం ద్వారా మంచి ఫలితాలు రావడం తో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు సిద్దమయ్యా మన్నారు. దీనికోసం అనుభవమున్న కంపెనీలను ఆహ్వానించారు. సాంకేతికంగా అనుభవం ఉన్నవారికి, ఇతర రాష్ట్రల్లో ఈ విధానం ను అమలు చేస్తున్నవారికి ఈ పాస్ మిషన్లను అమర్చేందుకు కంపెనీ తో ఒప్పదం కుదుర్చుకున్నారు. అయితే ఈ కంపెనీ అనుకున్న స్థాయిలో పని చేయడం లేదు అని ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశం లో మంత్రి ఈటల ఆగ్రహం వ్యక్తం చేసారు. దసరా పండగకు సరుకు అందిచలేకపోవడ పై అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేసారు. ఈ పాస్ మిషన్స్ సరిగా పనిచేస్తున్నాయో లేదో చూసుకున్న తరువాతనే క్షేత్ర స్థాయిలో అమలుకు సిద్ధం కావాలని తేల్చి చెప్పారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని బియ్యం అందిచలేకపోతుంటే ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. రాబోయే దీపావళి కి ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని కమీషనర్ సీవీ ఆనంద్ ను కోరారు. ఒక నెల ఆలస్యం అయినా పర్లేదు సమస్యలు లేకుండా ఈ పాస్ మిషన్ల ద్వారా అర్హులయిన ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం అందేలా చూడాలని కోరారు .
సాంకేతిక సమస్యల వల్ల గత నెలలో బియ్యం అందని ప్రతి ఒక్కరికి బియ్యం అందించాలని ఆదేశించారు. బియ్యం సేకరణ పై కూడా ఈ సమావేశంలో చర్చించారు. సన్నబియ్యం కోసం ఈ సంవత్సరం లక్ష యాభై వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్టు కమిషనర్ సీవీ ఆనంద్ మంత్రి కి వివరించారు. 27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. మొత్తంగా 8500 కోట్లు అవసరమవుతున్నట్టు అంచనా వేశారు. బియ్యం సేకరణ పూర్తి పారదర్శకంగా టెండర్ల ద్వార జరగాలని మంత్రి ఆదేశించారు. సన్న బియ్యం నిల్వ కు అన్ని వసతులు ఉన్న గోదాములను ఉపయోగించాలని మంత్రి ఆదేశించారు. పరిశుభ్రత పాటించాలని నిమ్ము రాకుండా చూసుకోవాలని కోరారు. గ్యాస్ కనెక్షన్స్ అడిగిన ప్రతి ఒక్కరికి అందేలా చూసుకోవాలని కోరారు.
చౌక ధరల దుకాణంలు పెంచాలని వస్తున్న దరఖాస్తులపై త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు . ఈలోగా మారుమూల ఉన్న తండాలు, గూడేలల్లో నెలలో రెండు రోజులు డీలర్లు వెళ్లి బియ్యం అందించాలని మంత్రి కోరారు. ఇంచార్జ్ ల అద్వర్యం లో నడుస్తున్న షాప్స్ కి
డీలర్ల నియామకం పై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. డీలర్లకు కమిషన్ పెంచే విషయం పై సీఎం గారితో చర్చించాక నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి తెలియజేసారు.