
“ఎవడబ్బా సోమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా” అన్నట్టు ఉంది మన హైదరాబాద్ పోలీసుల సంగతి. ప్రజల రక్షణ, సత్వర స్పందన,సమాజ పరిరక్షణ కోసం మన రాష్ట్రం లో పోలీసు వారికిచ్చిన ఇన్నొవా వాహనాలను వారి వారి సొంత పనులకోసం వాడుతున్నారు.
జీపీఏస్ సిస్టం పెట్టినం అని చెప్పినా కూడా ఇలాంటివి మనం రోజూ చూస్తునే ఉన్నాం. మీరు ఇపుడు చూస్తున్న ఫొటోలు కొత్తపేట దగ్గర మంగళవారం తీసినవి. ఈ పోలీసుల తీరు కేసీఆర్ చూసేదాకా.. ఆయన స్పందించేదాకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రజల సొమ్ము వృథా కాకుండా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి.