పోలీస్ అమరుల ఆత్మశాంతి కోసం ఎస్పీ సర్వమత ప్రార్థనలు

కరీంనగర్ : అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ కరీంనగరంలో సర్వమత ప్రార్థనాల్లో పాల్గొన్నారు. ఉదయం మొదటగా కరీంనగరంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిక్కుల ప్రధానదేవాలయం గురుద్వారాలో పూజలు చేశారు. మసీదు, చర్చిల్లో కూడా పూజలు చేశారు..

12

ఈ సందర్భంగా అమరులైన పోలీసుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. జిల్లాలో అమరులైన వారి సంస్మరణార్థం ప్రత్యేక కార్యక్రమాలు 21న చేపట్టనున్నట్టు ఎస్పీ తెలిపారు.ఆయన వెంట అడిషనల్ ఎస్పీ జనార్దన్ రెడ్డి, డీఎస్పీ రామారావు, సీఐలు విజయ సారథి, హరిప్రసాద్, శ్రీనివాస్ తో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *