
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియను పారదర్శకంగా కొనసాగించేందుకు శుక్రవారం జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ కౌన్సెలింగ్ నిర్వహించారు. మూడు, ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని వివిధ కుటుంబ, ఆరోగ్య కారణాలున్నవారికి బదిలీల కౌన్సిలింగ్ జరిగింది.జిల్లా వ్యాప్తంగా 200 మంది పురుష, మహిళా కానిస్టేబుళ్లు ఈ కౌన్సెలింగ్ కు హాజరయ్యారు. బదిలీల పారదర్శకత కోసం ఎస్పీ డేవిస్ జిల్లా కేంద్రానికి పోలీసులను రప్పించి చేయడం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.