పోలీసు ఉద్యోగాలకు 5 కి.మీ పరుగు లేనట్లే..

run2

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రాణాలు తీస్తున్న పోలీసు నియామక పరుగు పందెం పోటీల్లో భారీ మార్పులు చేసి ఊరట నిచ్చింది.. గతంలో పోలీస్ ఉద్యోగాల్లో 5 కి.మీ ల పరుగుపందెం తప్పనిసరిగా ఉండేది. దీనివల్ల పరుగులు తీయలేక చాలా మంది అభ్యర్థులు మరణించిన సందర్భాలున్నాయి.. దీనిపై ఉమ్మడి ఏపీలో చాలా నిరసనలు వ్యక్తమైన ఏ ప్రభుత్వం కూడా 5కి.మీల రద్దు ఆలోచించలేదు. దీంతో అభ్యర్థులు చాలా మంది అసువులు బాసారు..

సీఎం కేసీఆర్ కు చాలా మంది ఉద్యమ సమయంలో ఈ 5.కి.మీ పరుగుపందెంను రద్దు చేయాలని కోరారు. ప్రొఫెసర్ కోదండరాం కూడా సీఎం కేసీఆర్ కు ఈ మేరకు విన్నవించారు. 5.కి.మీల నిబంధనల వల్ల బాగా టాలెంట్ ఉన్న అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలకు ఎంపికవడం లేదని.. దీంతో కండలున్న వారు మాత్రమే సెలక్ట్ అయి నాణ్యత లోపిస్తుందని విన్నవించారు. దీంతో సహృదయంతో అర్థం చేసుకున్న కేసీఆర్ పోలీస్ సంస్కరణలకు ఆదేశించారు.

పోలీస్ కమిటీ వేసి సంస్కరణలపై అధ్యయనం చేశారు. ఈ 5.కి.మీల పరుగుపందెంను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మెరుగైన అభ్యర్థులు వచ్చి పోలీస్ వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని.. నిరుద్యోగులు,ప్రజలు ఆశిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *