
జిల్లాలో పోలీసుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా ఎస్పీ వి.శివకుమార్ అన్నారు. పోలీసులు క్రమశిక్షణతో మెదులుతూ సమర్ధవంతమైన సేవలందిస్తూ సంక్షేమ పధకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అత్యాధునికరించబడిన పోలీస్ వేల్ఫేర్ స్టోర్ ప్రధమ వార్షికోత్సవ సందర్భాన్నిపురస్కరించుకుని సోమవారం నాడు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యం లో మెగా సంక్షేమ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్ఫేర్ స్టోర్ లో కేక్ కట్ చేసిన అనంతరం ఏర్పాటైన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి.శివకుమార్ మాట్లాడుతూ ప్రతీ పోలీసు కుటుంబం విలాసవంతమైన గృహోపకరణ వస్తువులను వినియోగించుకునేందుకు వీలుగా
వాయిదా పద్దతులపై రుణసౌకర్యం ద్వారా వస్తువులను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీసు కుటుంబాలు సగర్వంగా జీవనవిధానాన్ని కొనసాగించాలనే ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జురుగుతున్నదని చెప్పారు. ప్రతీ పోలీసు మారుతున్న కాలానికనుగుణంగా వృత్తినైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ సత్ఫ్ర్రవర్తనతో మెదులుతూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొదించే విధంగా సమర్ధవంతమైన విధులను నిర్వర్తించాలని తెలిపారు. మెగా సంక్షేమ మేళా కార్యక్రమంలో కూలర్లు, ఫ్రిజ్ లు, టివిలు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, క్రెడిట్ కార్డులు, వివిధ రకాల మోటారు సైకిళ్ళను అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్వీ బి.జనార్ధన్ రెడ్డి, ఎఆర్ డిఎస్పీ కోటేశ్వరరావు, ఆర్.ఐలు గంగాధర్, శశిధర్ యాకుబ్ రెడ్డి, ఆర్.ఎస్.ఐలు చంద్రశేఖర్, నవీన్, స్వామి జిల్లా పోలీసు అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు యం.సురేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.