పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి

పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి

శాంతిభద్రతల పరిరక్షణ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న పోలీసులు ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు. మానసికంగా, శారీరకంగా సంసిద్దంగా ఉంటేనే సమర్ధవంతమైన సేవలందించవచ్చని పేర్కొన్నారు. 40 సంవత్సరాలు పైబడిన, స్ధూలకాయం ఉన్న కమీషనరేట్ పరిధిలోని వివిధ స్ధాయిలకు చెందిన పోలీసులు మానసిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు వివిధ దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ కోసం 15 రోజుల పాటు పతంజలి ఆయుర్ యోగా వారి సౌజన్యంతో పునరాకృతి పేరిట ఏర్పాటు నిర్వహించిన యోగా శిభిరం సోమవారం నాడు ముగిసింది. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు జీవనశైలిని మార్చుకోవాలన్నారు. రేయింబవళ్ళు విధులను నిర్వహించే పోలీసులు నడక, వ్యాయామం, యోగా ధ్యానంలను దినచర్యలో  భాగంగా అలవర్చుకోవాలని చెప్పారు. శరీరానికి హని కలిగించే ఘన, ద్రవ పదార్ధాలకు దూరంగా ఉండాలని చెప్పారు. నిపుణులు ఇచ్చిన సలహలు, సూచనలు పాటించాలని కోరారు. వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక  ఒత్తిడిని అధిగమించేందుకు వారం రోజుల పాటు యోగా శిక్షణ అందించనున్నామని, అనంతరం మూడు నెలలు సాధన చేయాలని చెప్పారు. మూడు నెలల తర్వాత మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మిగతా పోలీసులకు
కూడా అంచెల వారీగా యోగా ధ్యానం శిబిరాలను నిర్వహించనున్నామని చెప్పారు. మానసిక, వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న పోలీసులకు ఈనెల 8న మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి సౌజన్యంతో వైద్య పరీక్షల నిర్వహించిన విషయం విదితమే. వైద్య పరీక్షల్లో భాగంగా ఘుగర్, బిపిలతో పాటు ఇసిజి, రక్త పరీక్షలు, లిపిడ్ ప్రోఫైల్ ల పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల అనంతరం 102 మంది పోలీసులను గుర్తించి స్ధూలకాయం తగ్గించడంతో పాటు, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు వారం రోజుల పాటు యోగా, ధ్యానం శిబిరానికి ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎసిపి అశోక్ కుమార్, యోగా గురువు గురు రాంజి, ప్రోఫేసర్ విజయేందర్ రెడ్డి, ఇన్స్ పెక్టర్లు తుల శ్రీనివాసరావు, మహేష్ గౌడ్, విజయ్ కుమార్, ఆర్ ఐ గంగాధర్, పోలీసు అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు యం సురేందర్, ఆర్గనైజర్ పండరి తదితరులు పాల్గొన్నారు.

YOGA     YGGA 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *