పోలీసుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి

పోలీసుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి

 

పోలీసుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ అన్నారు. వయస్సు పెరుగుతున్న దృష్ట్యా వివిధ రకాల ఒత్తిళ్ళతో వ్యాధులు సంక్రమిస్తున్నాయని పరీక్షలు చేయించుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ అపోల్ రీచ్ ఆసుపత్రి సహకారంతో ఆదివారం నాడు జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్ ఆవరణలో పోలీసులకు ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ మాట్లాడుతూ మానసికంగా.శారీరకంగా సంసిద్దంగా ఉంటేనే సమర్ధవంతమైన సేవలందించవచ్చన్నారు. జిల్లా పోలీసుల సమర్ధవంతమైన సేవలకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు. పోలీసు కుటుంబసభ్యులకు కూడా ఉచిత వైద్యసేవలందించేందుకు వైద్యశిబిరాలను నిర్వహించనున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని యూనిట్ ఆసుపత్రిలో అన్నిరకాల రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని, పోలీసు కుటుంబాలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వైద్యశిబిరం సందర్భంగా పోలీసులకు బిపి, ఘుగర్, ఈసిజి, బోన్ మినరల్ బెన్ ఫిటి, 2డిఏకో, గుండె, ఎముకల పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయా విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పరాయుడురిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ.ఎస్.డి ఎల్. సుబ్బారాయుడు, ట్ర్త్తైనీ ఐపిఎస్ అధికారిణి సింధుశర్మ, కరీంనగర్, ఎ.ఆర్. డి.ఎస్.పిలు జె.రామారావు. డి.కోటేశ్వరరావు, ఆర్.ఐలు గంగాధర్, శశిధర్, అపోలోరీచ్ అడ్మినిస్ట్ర్రేటివ్ అధికారి బాబురావు, మెడికల్ సూపరిండెంట్ నరేష్ కుమార్, యూనిట్ ఆసుపత్రి వైద్యులు, ఆసుపత్రి ఇంఛార్జి చంద్రశేఖర్, అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *