పోలీసుల ఆయుధాలకు ఆయుధ పూజ

కరీంనగర్ (పిఎఫ్ ప్రతినిధి): దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్సీ డి జోయల్ డేవిస్, ఇతర పోలీసు అధికారులు జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జమ్మిపూజ, వాహనాల పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ డి జోయల్ డేవిస్, అడిషనల్ ఎస్సీ బి జనార్ధన్ రెడ్డి, ఓఎస్ డి ఎల్ సుబ్బరాయుడు తదితర అధికారులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని సిబ్బందికి జమ్మి ఆకును అందిస్తూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్సీ డి కోటేశ్వరరావు, రిజర్వ్ ఇన్స్ సెక్టర్లు గంగాధర్, శశిధర్, ఆర్ఎస్ఐలు స్వామి, నవీన్, జానీమియా, చంద్రశేఖర్ లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *