పోలీసులు మానసికంగా శారీరకంగా సిద్దంగా ఉండాలి

పోలీసులు మానసికంగా శారీరకంగా సిద్దంగా ఉండాలి

కరీంనగర్: ప్రజలకు సేవలందించేందుకు పోలీసులు మానసికంగా, శారీరకంగా సంసిద్దంగా ఉండాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి అన్నారు. వ్యాయామం, యోగా, ధ్యానాలను దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలని సూచించారు. శుక్రువారం నాడు కమీషనరేట్ కేంద్రంలోని దివంగత ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హల్లో రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో యోగా, ధ్యానంలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ యోగా, ధ్యానంలు మానసికంగా, శారీరకంగా సంసిద్దంగా ఉంచేందుకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. లక్ష్యసాధనకు ఆత్మస్ధ్త్తెర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వయస్సు పైబడినా వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని ఈ సందర్భంగా ఉదాహరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సిపి టి. అన్నపూర్ణ, ట్ల్ర్రెనీ ఐపిఎస్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, రామకృష్ణ మిషన్ ప్రతినిధులు సంపత్ కుమార్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర్ర అధ్యక్షులు
జిల్లా కేంద్రంలోని సిటి పోలీస్ శిక్షణ కేంద్రం (సిపిటిసి), పోలీస్ ట్ల్ర్రెనింగ్ కళాశాల (పిటిసి) లను రాష్ట్ర్ర పోలీసు అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు వై. గోపిరెడ్డి శుక్రువారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణలో మృతిచెందిన పోలీసులకు నివాళులర్పించి మౌనం పాటించారు. శిక్షణలో ఒత్తిడి తగ్గించాలని అధికారులను కోరారు. అనంతరం పోలీస్ కమీషనర్ ను మర్యదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల సంక్షేమాలను తెలియజేస్తూ రూపొందించిన క్యాలెండర్ ను కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎల్ అధ్యక్షులు యం.రాము, జిల్లా పోలీసు అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు యం. సురేందర్, కార్యదర్శి తుల శ్రీనివాసరావు, రాష్ట్ర్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రవికాంత్, ప్రతినిధులు బి.రవి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *