
వారు సైబరాబాద్ పోలీసులు.. రోడ్డు పక్కన అమ్ముకుంటున్న కూరగాయాల రైతులపై తమ ప్రతాపం చూపారు. పాపం రైతులు రోడ్డు పక్కన అమ్ముకుంటుంటే అక్కడికి ట్రాఫిక్ సైబరాబాద్ పోలీసులు వచ్చారు. కనీసం తీసేయమని కూడా అనలేదు.. వడివడిగా వచ్చి కూరగాయల బుట్టలను తమ వ్యాన్ లో పెట్టుకొని పోయారు.
రైతు కాళ్ల వేళ్ల పడ్డా.. వ్యాన్ వెంట పరిగెత్తినా కనికరించలేదు ఆ కటిక పోలీసులు.. ఇదంతా అక్కడున్న ఓ యువకుడు ఫోన్ లో రికార్డు చేసి పోలీసులకే వాట్సాప్ పెట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సైబరాబాద్ పోలీసుల పరువుతీస్తోంది. దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది..