
40సంవత్సరాలు పైబడిన, స్ధూలకాయం ఉన్న కమీషనరేట్ పరిధిలోని వివిధ స్ధాయిలకు చెందిన పోలీసులకు శుక్రువారం నాడు మ్యాక్స్ కూర్ ఆసుసత్రి సౌజన్యంతో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ శిభిరాన్ని పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ఆరోగ్య రక్షణకు ప్రాధాన్నమివ్వాలన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ విధులను నిర్వహించేందుకు నడక, యోగా, ధ్యానంలను దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలని చెప్పారు. పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. ఘుగర్, బిపిలతో పాటు ఇసిజి, రక్తపరీక్షలు లిపిడ్ ప్రోఫైల్ పరీక్షలు నిర్వహించారు. నివేదికల ఆధారంగా పోలీసులకు శనివారం నాడు అవగాహన కల్పించడంతో పాటు, మందులను అందజేస్తారు. కమీషనరేట్ పరిధిలోని 250మంది పోలీసులు హజరయ్యారు. స్ధూలకాయం తగ్గించడంతో పాటు, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ గంగాధర్, మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి వైద్యులు అమరేష్ రెడ్డి, తాహర్, ఏఓ కిరణ్, ఆసుపత్రి అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ కమీషనర్ కు సన్మానం
గణేష్ నవరాత్రులు, బక్రీద్ పర్వదినం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి సఫలీకృతం అయినందుకు తెలంగాణ రాష్ట్ర్ర పర్యావరణ పరిరక్షణ సమితి నిర్వాహకులు శుక్రువారం నాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డిని సన్మానించారు. ప్రజల భద్రత కోసం చేపడుతున్న సంస్కరణలను కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు నీలం నాగరాజు, ప్రతినిధులు ఎల్కపల్లి శివ, కె. అనీల్, నీల కిరణ్, పూదరి శివ, మంధని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.