
పోలిస్ శాఖపై మక్కువతో కరీంనగర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భారతం గోపి అనే యువకుడు వివిధ దినపత్రికల్లో ప్రచురితం అయిన వార్తలను ఒక అల్బంగా తయారు చేసి శనివారం నాడు కరీంనగర్ జిల్లా ఎస్పీ వి.శివకుమార్ కు అందజేశారు. కరీంనగర్ జిల్లా ఎస్పీగా వి.శివకుమార్ బాధ్యతలు చేపట్టిన గత నవంబర్ మాసం నుండి ఇప్పటి వరకు పోలిస్ శాఖకు సంబంధించి వివిధ దినపత్రికల్లో ప్రచురితం అయిన అన్ని రకాల వార్తలను ఈ అల్బంలో పొందుపరిచారు.
పోలిస్ శాఖ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములవుతున్నారని పేర్కోనడానికి ఈ యువకుడి ఉత్సాహం ఒక నిదర్శనమని ఎస్పి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు పోలిస్ శాఖ అండగా ఉంటుందని ప్రజలు పోలీసుల సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.