పోలింగ్ స్టేషన్ల లొకేషన్, వసతులు ఆన్ లైన్లో నమోదు చేయాలి

పోలింగ్ స్టేషన్ల లొకేషన్, వసతులు ఆన్ లైన్లో నమోదు చేయాలి

కరీంనగర్: జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేసన్ల లొకేషన్లు, కనీస వసతులు వివరాలు ఆన్ రైడ్ మోబైల్ అప్లికేషన్ నమోదు చేయాలని ఎస్.ఐ.సి. టెక్కికల్ డైరెక్టర్ బి. రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేటు సమావేశమందిరంలో ఎలక్ట్ర్రోల్ రిజిస్ట్ర్రేషన్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఆన్ రైడ్ మోబైల్ అప్లికేషన్ నమోదు పై శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి పోలింగ్ స్టేషన్ల సమగ్ర వివరాలను స్గార్ట్ ఫోన్ ద్వారా ఆన్ లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ముందుగా పోలింగ్ స్టేషన్ భవనం పరిస్ధితి, ప్రభుత్వ భవనము, ఏదేని మత పరమైన భవనములో ఉందా వివరాలు, ప్రభుత్వ పాఠశాల/కాలేజి భవనం, గ్రౌండ్ ఫ్లోర్, ప్రత్యేకంగా లోనికి, బయటకు ఉన్నగేట్ల వివరాలు, ఏదేని రాజకీయ పార్టీ ఆఫీసుకు 200 మీటర్ల పరిధిలో ఉన్నదా అనే వివరాలు నమోదు చేయాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్లో కనీస వసతులైన త్రాగునీరు, విద్యుత్ సరఫరా, సరియైన వెలుతురు ఉన్నది లేనిది, స్త్ర్రీ, పురుషులకు టాయిలెట్ వసతి, భవనానికి ర్యాంప్ సౌకర్యం, సరియైన ఫర్నిచర్, ఎండకు, వాన నుండి రక్షణకు సరియైన షెడ్డు ఉన్నది లేనిది నమోదు చేయాలని సూచించారు. అలాగే పోలింగ్ స్టేషన్లకు సరియైన రోడ్డు సౌకర్యం, ఓట్లు పోలింగు బూతుకు వచ్చుటకు ఏమైనా వాగులు, నదులు, ఒర్రెలు దాటవలసిన ఉన్న వివరాలు ఇంటర్ నెట్ సౌకర్యం, భవనము సైన్ బోర్డ్ వివరాలు నమోదు చేయాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ బిల్డింగ్ ముందు భాగంలో ఫోటో, కుడి ప్రక్క, ఎడమ ప్రక్క ఫోటో గ్రాఫ్ లు తీసి ఆన్ లైన్లో నమోదు చేయాలని తెలిపారు. అలాగే పోలింగ్ స్టేషన్ అటవి ప్రాంతంలో ఉన్నది లేనిది వివరాలు, పోలింగ్ స్టేషన్ సమస్యత్మాక , అతి సమస్యత్మాక ప్రాంతాలలో ఉన్న వివరాలు నమోదు చేయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ రూటు మ్యాపులు తయారు చేసి ఆన్ లైన్లో నమోదు చేయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ గదిలో ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్స్, 1,2,3,4 సీటింగ్ ఏర్పాట్లు, బూత్ ఏర్పాట్లు, ఏజెంట్ల సీటింగ్ ఏర్పాట్లు, గది లోపలికి బయటకు డోర్ల వివరాలతో కూడిన మ్యాపులు తయారు చేసి ఆన్ లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఎన్నికలలో పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన సమగ్ర సమాచారం ఆన్ రైడ్ అప్లికేషన్ ద్వారా ఆన్ లైన్లో నమోదు చేయాలని తెలుపుచూ ఎల్.సి.డి. ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి. వీరబ్రహ్మయ్య, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *