Breaking News

పోలింగ్ సరళి చూస్తే కారు జోరు

trs car

వరంగల్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళి చూస్తే కారు జోరు కన్పిస్తోంది. టీఆర్ఎస్ గెలుపు వరంగల్ లో ఈజీ అనే టాక్ వినపడుతోంది. అన్ని చోట్ల  టీఆర్ఎస్  అభ్యర్థి దయాకర్ కే ఆధిక్యత  కన్పిపించంది. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నాయకులను బరిలోకి దించి విస్తృతంగా ప్రచారం చేసినా.. టీఆర్ఎస్ కు ప్రభుత్వ పథకాలే ఆ పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్నిఇచ్చింది.  ముఖ్యంగా పించన్లు, రేషన్ కార్డులు (6 కిలోలు వ్యక్తికి), కళ్యాణలక్ష్మీ,ఆరోగ్యలక్ష్మీ, నిరంతర విద్యుత్ సరఫరా, ఇతర సంక్షేమ పథకాలు జనంలోకి బాగా వెళ్లాయి. కాంగ్రెస్ గెలుపు స్థానికేతర అభ్యర్థి సర్వేతో కొంత వెనుకబడింది. కాంగ్రె స్ కు రెండోస్థానం దక్కే అవకాశాలున్నాయి. బీజేపీ-టీడీపీ క్యాండిడేట్ కు 3వ స్థానం ఖాయంగా కనిపిస్తోంది.మొత్తానికి ఓరుగల్లులో గులాబీ పరిమళమే వీచింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *