“పోర్టబుల్ సోలార్ మైక్రో కోల్డ్ రూం” ను ఆవిష్కరించిన మంత్రి

రుణాల కోసం రైతులు బ్యాంకుల మీద ఆదారపడే పరిస్థితి నుంచి సేద్యంలో లాభాల ద్వారా అప్పు వద్దు అనే పరిస్థితి వ్యవసాయ రంగంలో తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు తెలిపారు.

ఈరోజు హైదరాబాద్ జీడిమెట్ల లోని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సి (COE)లో జరిగిన “పోర్టబుల్ సోలార్ మైక్రో కోల్డ్ రూం” ను ఆవిష్కరించిన మంత్రి గారు అనంతరం మాట్లాడుతూ ఇటువంటి పరిశోదనలు వ్యవసాయ రంగానికి ఎంతో అవసరం అన్నారు. ఎక్కువ మొత్తంలో పంట ఉత్పత్తులు వచ్చినప్పుడు ధళారులు ఒక్కసారే ధరలు తగ్గించడంతో రైతులు బారీగా నష్టపోతున్నారు. నిల్వ చేసుకోవడానికి అవసరమైన వసతులు లేకపోవడంతో పంటలు కుళ్ళిపోతాయని వచ్చిన ధరకు అమ్ముకోని రైతులు నష్టపోతున్నారు. ఇటువంటి పోర్టబుల్ కోల్డ్ స్టోరేజీలలో ఉత్పత్తులను నిల్వ చేసుకోని మంచి ధరలు వచ్చినఫ్పుడు అమ్ముకోవడానికి రైతులకు అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 7.17 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలను పండిస్తున్నారని ఇందులో 4 లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు, 2 లక్షల హెక్టార్లలో కూరగాయలు, 30 వేల హెక్టార్లలో పూల తోటలు సాగులో ఉన్నాయన్నారు. ఉద్యాన పంటలకు ఇటువంటి శీతల నిల్వ కేంద్రాలు ఎంతో ఉపయోగకరం అని తెలిపారు.

దేశంలోనే వ్యవసాయ రంగానికి అత్యధిక సబ్సిడీలను ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి గారు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 45 లక్షల ఎకరాలు బోర్లు, బావుల క్రింద సాగవుతుందని దీనికంతటికి సూక్ష్మ బిందు సేద్యాన్ని దశలవారిగా కల్పిస్తామన్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించడానికి డ్రిప్, స్ప్లింకర్ టెక్నాలజి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నాబార్డు 1000 కోట్లను సూక్ష్మ సేద్యం కోసం రుణంగా ఇచ్చిందని ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నాబార్డుకు తిరిగి చెల్లిస్తుందన్నారు.
పాలీహౌస్ ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రెండు సంవత్సరాలలోనే 1000 ఎకరాలకు అనుమతులు ఇచ్చామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వనంతగా 75 శాతం సబ్సిడి కల్పించామన్నారు. రైతు సంక్షేమమే ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారీ సబ్సిడీలతో అనేక పథకాలను అమలుపరుస్తున్నారన్నారు.

ఇటువంటి కోల్డ్ స్టోరేజిలను సబ్సిడిపై అందజేస్తే తీసుకోవడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి గారు హామి ఇచ్చారు. స్వయంగా రైతు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉద్యాన పంటలపై మంచి అవగాహన ఉందని, రైతులకు ఉపయోగపడే నూతన పరిశోదనలకు ప్రోత్సాహాం ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం 35 శాతంగా ఉన్న సబ్సిడీని 50 శాతంకు పెంచాలని రైతులు కోరుతున్నారని , త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సిఫారసు లెటర్ తో డిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రాధామోహన్ శ్యాం గారితో ఈ విషయంపై ప్రత్యేకంగా మాట్లాడుతానని తెలిపారు.

రేయా సోలార్ కంపెనీ రూపోందించిన ఈ పోర్టబుల్ సోలార్ మైక్రో కోల్డ్ రూం ప్రోడక్ట్ లను “ఈకో ఫ్రాస్ట్” అనే బ్రాండ్ పేరుతో మార్కెట్ లోకి విడుదల చేశారు. మొదటి యూనిట్ ను నిజామాబాద్ జిల్లాకు చెందిన పాలీహౌస్ రైతు నవీన్ కు మంత్రి గారు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి MLA ఏనుగు రవీందర్ రెడ్డి, ఉద్యాన శాఖ కమీషనర్ యల్ వెంకట్రామిరెడ్డి, ఉద్యాన శాఖ అధికారులు, రైతులు పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *