పోచారం తొడ ఎందుకు వాచిపోయింది..?

తెలంగాణ వ్యవసాయం శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ఒక పాత వాస్తవ సంఘటన చెప్పారు..  నాడు చంద్రబాబు టీడీపీ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నానని.. ఆ సమయంలో నిజాం షుగర్స్ ప్రైవేటీకరణను చేస్తానన్న చంద్రబాబు నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని తెలిపారు. ఆ సమయంలో సీఎం చంద్రబాబు అసహనంతో కేబినెట్ భేటిలో తన తొడపైన కొట్టారని వివరించారు. దండం పెట్టి వేడుకున్నా నిజాం షుగర్స్ ను ప్రైవేటీకరణను ఆపలేదని వాపోయారు.

దీంతో టీడీపీ నేత రేవంత్ కలుగజేసుకున్నారు. అప్పుడు మంత్రి, హోదాలో ఉండి ఈ విషయం చెప్పని పోచారం పదవులన్నీ అనుభవించి ఇప్పుడు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హాయాం ముగిసాక ఈయన గురించి అలా చెబుతాడు అంటూ చలోక్తి విసిరారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *